ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు
తల్లాడ: తల్లాడ–సత్తుపల్లి జాతీ య రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యా యి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన పలువురు ఆటోలో తల్లాడ మండలం మిట్టపల్లిలో బంధువుల ఇంట కర్మకు హాజరై తిరి గి వెళ్తున్నారు. తల్లాడ మండలం అంజనాపురం వద్ద గేదె అడ్డు రావడంతో ఆటో ముందు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారి బ్రేక్ వేయగా కింద పడ్డాడు. ఆ వెంటనే ఆటో డ్రైవర్ కూడా సడెన్ బ్రేక్ వేయగా బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న గొర్రెముచ్చు అరుణ, మాలోచి ఆరోగ్యమ్మ, గొర్రెముచ్చు మౌనిక, మణెమ్మ, సిరి, జాన్సీ, గుత్తికొండ జ్ఞాన సుందరికి కాళ్లు, చేతులు, తలకు గాయాలయ్యాయి. అలాగే, బైక్‌పై వెళ్తున్న మట్టగాని గురుపాదం కూడా గాయపడగా క్షతగాత్రులను 108 లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కోతుల దాడిలో మహిళలకు గాయాలు
కొణిజర్ల: గుంపుగా వచ్చిన కోతులు చేసిన దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వైరా మున్సిపాలిటీ పరిధిలోకి కొణిజర్ల మండలం దిద్దుపూడిలో కొందరు మహిళలు బుధవారంరోడ్డు పక్కన నిలుచుని మాట్లాడుతుండగా పెద్దసంఖ్యలో వచ్చిన కోతులు దాడి చేశాయి. దీంతో కొందరు తప్పించుకుపోగా, మరికొందరు గాయపడ్డా రు. గ్రామానికి చెందిన షేక్ లాల్‌బీ, షేక్ అమీనాబీ, షేక్ రజియాబేగం, షేక్ నిజాంబీ, అమర్లపూడి సైదమ్మకు గాయాలు కాగా, కోతుల బెడదపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వేణు చేరుకుని వారికి నచ్చచెప్పగా, త్వరలోనే కోతులను అటవీ ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి మహిళలకు వైరా పీహెచ్‌సీలో చికిత్స చేయించారు.
గంజాయితో పట్టుబడిన యువకులు
వైరా: గంజాయి తీసుకెళ్తున్న నలుగురు యువకులను వైరా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని స్టేజీ పినపాక సమీపాన బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా వైరా, దిద్దుపూడికి చెందిన కోటేశ్వరరావు, అజయ్ కారులో 2.4 కేజీల గంజాయి తీసుకెళ్తూ పట్టుబడ్డారు. అలాగే, సాయి వంఽశీ, సందీప్ బైక్‌పై వెళ్తుండగా అనునానంతో అదుపులోకి తీసుకున్నారు. కాగా, వీరికి గంజాయి సరఫరా చేసే ఎక్కిరాల రామకృష్ణ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు


