కాంగ్రెస్‌లో కష్టపడే వారికే పదవులు
సత్తుపల్లిటౌన్: కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని కష్టపడి పని చేసేవారికే పదవులు లభిస్తుందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి స్పష్టం చేశారు. సత్తుపల్లిలో శుక్రవారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత పహల్గాం మృతులకు నివాళులర్పించాక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కష్టపడే వారికి పదవుల్లో అన్యాయం జరగదని తెలిపారు. ఇదే సమయాన సిఫారసులతో పదవులు రావని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యాన అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెలిపారు. పార్టీ జిల్లా పరిశీలకులు నాయిని రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాగమయి మాట్లాడగా పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, సత్తుపల్లి జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.37 లక్షలతో నిర్మించే పబ్లిక్ టాయిలెట్ల పనులకు శంకుస్థాపన చేశారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, బత్తిని శ్రీనివాస్, అనిల్, కొప్పుల చంద్రశేఖర్, బొడ్డు బొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, శేఖర్‌గౌడ్, దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజ, గాదె చెన్నారావు, శివవేణు, మందపాటి ముత్తారెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, సందీప్‌గౌడ్, కమల్‌పాషా, చల్లగుళ్ల నర్సింహారావు, పింగళి సామేలు, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ఉడతనేని అప్పారావు, నారాయణవరపు శ్రీనివాస్, తోట సుజలరాణి పాల్గొన్నారు.
గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలి
వైరా: కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో నాయని రాజేందర్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో సంస్థాగత నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నందున పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు బత్తిని శ్రీనివాస్, పులి అనిల్‌కుమార్, శీలం వెంకటనర్సిరెడ్డి, వడ్డెనారాయణరావు, తలారి చంద్ర ప్రకాశ్, స్వర్ణ నరేందర్, మంగీలాల్, ఏదునూరి సీతారాములు, బొర్రా రాజశేఖర్, కట్లరంగారావు, సూతకాని జైపాల్, పగడాల మంజుల, దాసరి దానియేలు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లండి..
ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
కాంగ్రెస్‌లో కష్టపడే వారికే పదవులు


