ఇంటర్ ఫలితాల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనే ఉత్తమ మార్కులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ వరధారెడ్డి తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో ఇందూరి రశ్మిత 996 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకు సాధించిందని వెల్లడించారు. అలాగే, ఫస్టియర్ ఎంపీసీలో హాసిని, పశాంతిక రమ్య 468, సాత్విక్, తేజస్విని, రోహిణి, టి.తేజస్విని, ఉజ్వల, ప్రసన్నకుమారి, యామిని, వినిషా, అంకిత, సాయితేజ 467 మార్కులు, బైపీసీలో సాయిలక్ష్మి 435, శ్రావ్య, సుమేరా ముస్కాన్ 434, మేనక, శరణ్య, మేధ 433 మార్కులు సాధించారని తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో వెంకటలక్ష్మి తేజస్విని 995, కావ్య 994, శ్రీ వర్షిత, అమూల్య, జశ్విత 993, బైపీసీలో కార్తీక 994 మార్కులు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను చైర్మన్ వరదారెడ్డితో పాటు డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సీఈఓ సురేందర్‌రెడ్డి, డీజీఎం గోవర్దన్ రెడ్డి, జోనల్ ఇన్‌చార్జ్ విజయభాస్కర్ రెడ్డి, డీన్ శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాళ్లు అశోక్, శ్రీనివాస్, సుధాకర్, బ్రహ్మం, అధ్యాపకులు అభినందించారు.


