విజేతలకు బహుమతుల అందజేత
ఖమ్మంస్పోర్ట్స్: నగరంలోని సర్వజ్ఞ పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి చదరగం పోటీలు ఆదివారం జరిగాయి. బహుమత్రి ప్రదానానికి ముఖ్య అతిథిగా సర్వజ్ఞ స్కూల్ చైర్మన్ నాగేంద్రకుమార్ అంతర్జాతీయ రేటింగ్ క్రీడాకారుడు, నిర్వాహకుడు, సీహెచ్.గోపి, రాష్ట్ర చెస్ అసోసియేషన్ బాధ్యులు జి.జ్యోత్న్స, డి.సాంబశివరావు, రామారావు, ఎస్.అరుణ, సాయికుమార్ హాజరై విజేతలకు బహూమతులు అందజేశారు. అండర్–10 బాలురలో శివనాగసాయి, కె.నీరాజ్, అనురాగ్ ప్రకాష్, బాలికల్లో బ్రిందభావజ్ఞ, చరిత, దుర్గారాయ్, అండర్–13 బాలురలో ప్రతీక్‌సింగ్, అనిష్ సూర్య, ద్యుమన్, బాలికల్లో యశ్వితసాలిపవార్, కావ్యశ్రీ, లాస్య, అండర్–16 బాలికల్లో ఎం.వర్షిత, ఎస్.కీర్తన, హిమజ విజేతలుగా నిలిచారు.
బైక్‌లను ఢీకొన్న లారీ
ఒకరి మృతి..
నేలకొండపల్లి: బైక్‌ను ఢీకొట్టిన లారీ.. తప్పించుకునే క్రమంలో మరో బైక్‌ను ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బోదులబండ అండర్‌పాస్ వద్ద రాజస్థాన్‌కు చెందిన, క్వారీలో పనిచేసే కూలీల బైక్‌ను లారీ ఢీకొట్టింది. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో లారీని వేగంగా నడుపుతూ డ్రైవర్.. కొద్దిదూరంలో మరోబైక్‌ను ఢీకొట్టాడు. దీంతో మొదటి బైక్‌పై వస్తున్న రాజస్తాన్ కూలీల్లో హరికిరణ్ (36) మృతిచెందాడు. అదే ప్రమాదంలో రాజ్‌బహుదూర్, రాంజీలాల్, మరో బైక్‌పై వస్తున్న తిరుమలాపురం గ్రామనికి చెందిన భూక్యా వెంకటసాయి తీవ్రంగా గాయపడ్డారు. లారీడ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. లారీడ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
చెన్నారంలో చోరీలు..
నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో రెండు ఇళ్లలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని చెన్నారంలో మూడు రోజుల కిందట కందగట్ల కృష్ణ, బోయినపల్లి వేణు నివాసాల్లో చోరీ జరిగింది. తలుపులు పగలగొట్టి.. బీరువాలో ఉన్న నగదును చోరీ చేశారు. రెండిళ్లలో కలిపి రూ.6 వేల వరకు నగదు చోరీకి గురవగా.. ఆదివారం బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రులు
మందలించారని
యువకుడు ఆత్మహత్య
నేలకొండపల్లి: ఖరీదైన మొబైల్ కొన్నందుకు తల్లిదండ్రులు మందలించారని.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని శంకరగిరితండాకు చెందిన ధరావత్ రాజు (24) రెండు రోజుల కిందట ఖరీదైన మొబైల్ కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంత ఖరీదు పెట్టి ఎందుకు కొనుగోలు చేశావని.. పైగా ఏపని చేయటం లేదని.. తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన రాజు పురుగులమందు తాగగా కుటుంబసభ్యులు ఖమ్మం వైద్యశాలకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధుడు అదృశ్యం
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన 64 ఏళ్ల తుడుం బక్కయ్య కనిపించకుండా పోయిన ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన కటింగ్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బక్కయ్య తిరిగి రాలేదు. బక్కయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ నాగుల్‌మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
మోటారు చోరీ
నేలకొండపల్లి: వ్యవసాయ విద్యుత్ మోటార్లను దుండగులు చోరీ చేశారు. మండలంలోని మోటాపురం గ్రామానికి చెందిన ఏలూరి రవికుమార్‌కు చెందిన పొలం వద్ద ఉన్న విద్యుత్ మోటార్‌ను గుర్తు తెలియని దుండగలు చోరీ చేశారు. బాధితుడు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.
ఇసుక ట్రాక్టర్ సీజ్
బోనకల్: ఏపీ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను ఎస్‌ఐ మధుబాబు పట్టుకొని సీజ్ చేశారు. ఏపీలోని లింగాల నుంచి బోనకల్ మండలం ఆళ్లపాడు మీదుగా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా ఎస్‌ఐ పట్టుకున్నారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విజేతలకు బహుమతుల అందజేత
విజేతలకు బహుమతుల అందజేత


