‘భూ భారతి’తో రెవెన్యూ వ్యవస్థకు కొత్త జీవం
ఖమ్మం సహకారనగర్: రెవెన్యూ చరిత్రలో భూ భారతి చట్టం నూతన అధ్యాయమని పలువురు పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్‌రావు ఆధ్వర్యాన శనివారం ఖమ్మం డీపీఆరీసీ భవనంలో భూ భారతి చట్టం, జీపీఓల విధులు, బాధ్యతలపై అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో టీజీటీఏ జిల్లా కన్వీనర్ కోటా రవికుమార్‌తో పాటు ఓ.వెంకటేశ్వరరావు, ఆదిరాజు సీతారామరాజు, గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనర్సింహులు మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేలా భూ భారతి చట్టాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గతంలో వీఆర్వోలుగా విధులు నిర్వర్తించిన వారు తిరిగి రెవెన్యూ శాఖలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీఆర్వోల సంఘం నాయకులు బోళ్ల శ్రీనివాస్, రాఘవేందర్, తాటి ఇందిరమ్మ, కొమరం కృష్ణవేణి, వసంతబాయి, శ్రీవాణి, పద్మ, శ్రీకాంత్, కాక శ్రీను, ఎస్.కే.జానీమియా, ధరావత్ భాస్కర్, వజ్జా రామారావు, కిషోర్, బంక కృష్ణయ్య, వాంకుడోత్ వెంకన్న, మక్కాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


