
యూవీకెన్ సేవలు అభినందనీయం
కామేపల్లి: మహిళలు రొమ్ము కేన్సర్ బారిన పడకుండా అవగాహన కల్పించేందుకు యువరాజ్‌సింగ్ ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని డీఎంహెచ్‌ఓ కళావతిబాయి తెలిపారు. యూవీకెన్ ఫౌండేషన్ ఆధ్వర్యాన కామేపల్లి మండలంలోని మహిళలకు ఉచితంగా రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, ఫౌండేషన్ సిబ్బందికి గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రతీ మహిళ రొమ్ము కేన్సర్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మండలంలో యూవీకెన్ ఫౌండేషన్ ద్వారా 3,997 మందికి పరీక్షలు చేయగా, 48 మంది అనుమానితులకు నిర్ధారణ కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అనంతరం ఏఎన్‌ఎంలు, ఆశాలకు క్రికెట్ పోటీలను నిర్వహించారు. డిప్యూటీ డీంహెచ్‌ఓ డాక్టర్ సైదులు, డీఐఓ చందునాయక్, డీపీఓ దుర్గ, ఫౌండేషన్ జిల్లా మేనేజర్ హరిత భూపాలన్, సిబ్బంది సత్యవతి, డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.