జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

Feb 9 2025 12:24 AM | Updated on Feb 9 2025 12:24 AM

జమలాప

జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మూల విరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని శ్రీవారి పాదానికి అర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. ఆతర్వాత స్వామి, అమ్మ వార్లను పట్టువస్త్రాలతో అలంకరించి నిత్య కల్యాణం జరిపించడమే కాక వేలాదిగా హాజరైన భక్తుల సమక్షాన పల్లకీసేవ నిర్వహించారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన నర్సింగోజు శశాంక్‌– కావ్య దంపతులు ఆలయంలో నిత్యాన్నదానానికి రూ.1,00,016 విరాళం అందచేశారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్‌ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.

హైవే హద్దుల నిర్ధారణకు సర్వే

రఘునాథపాలెం: నాగపూర్‌–అమరావతి నేషనల్‌ హైవే నిర్మాణంలో భాగంగా ప్లాట్లు కోల్పోతున్న వారి వినతితో హద్దుల నిర్ధారణకు సర్వే చేయిస్తున్నారు. రఘునాథపాలెం తహసీల్దార్‌ లూథర్‌ విల్సన్‌, ఆర్‌ఐలు సతీష్‌, ప్రవీణ్‌, సర్వేయర్‌ శివ, నేషనల్‌ హైవే అఽథారిటీ ఇంజనీర్ల ఆధ్వర్యాన శనివారం సర్వే చేశారు. రఘునాథపాలెం, వీ.వీ.పాలెం రెవెన్యూ గ్రామాల పరిధిలో పలువురు ప్లాట్ల యజమానులు హైవే నిర్మాణంలో ఎంత భూమి కోల్పోతున్నామో మార్కింగ్‌ చేయాలని ఇటీవల ఆర్‌డీఓకు విన్నవించగా సర్వే ద్వారా నిర్ధారించారు.

జిల్లాకు చేరిన

118 బ్యాలెట్‌బాక్స్‌లు

ఖమ్మం సహకారనగర్‌: వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మాస్టర్‌ ట్రెయినీలు మాధవి, రాజేశ్వరి ద్వారా పలువురు ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. వీరు మండలాల వారీగా సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 24 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయనుండగా శనివారం జిల్లాకు 118 జంబో బ్యాలెట్‌ బాక్స్‌లు చేరాయి. వీటిని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చినట్లు డీఆర్‌ఓ పద్మశ్రీ తెలిపారు.

ప్రశాంతంగా

‘నవోదయ’ ప్రవేశపరీక్ష

కూసుమంచి: పాలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరం 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి శనివారం ప్రవేశపరీక్ష నిర్వహించారు. పాలేరులోని నవోదయ విద్యాలయలో 9వ తరగతికి, కూసుమంచిలోని ఉన్నత పాఠశాల, ఖమ్మంలోని ఎన్నెస్సీ కాలనీ, రిక్కాబజార్‌, శాంతి నగర్‌ ఉన్నత పాఠశాలల్లో 11వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 9వ తరగతిలో ప్రవేశానికి 753 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 544 మంది, 11వ తరగతిలో 1,384 మందికి గాను 1,182 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలోని పలు కేంద్రాలను డీఈఓ సోమశేఖరశర్మ, కూసుమంచి తహసీల్దార్‌ కరుణశ్రీ, నవోదయ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు పర్యవేక్షించారు.

జమలాపురంలో  శ్రీవారికి ప్రత్యేక పూజలు 
1
1/3

జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

జమలాపురంలో  శ్రీవారికి ప్రత్యేక పూజలు 
2
2/3

జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

జమలాపురంలో  శ్రీవారికి ప్రత్యేక పూజలు 
3
3/3

జమలాపురంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement