
మన్నికకు పేరెన్నిక భారతి సిమెంట్
ఇల్లెందు: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ ఆల్ట్రాఫస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్‌ను రాష్ట్రంలో విడుదల చేసిందని సంస్థ ఏరియా సేల్స్ ఇన్‌చార్జ్ విజయ సింహ తెలిపారు. సిమెంట్ రంగంలో ఇతర సంస్థలతో పోలిస్తే మూడు రేట్లు మెరుగైందని సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సాగర్ రెడ్డి అన్నారు. ఇల్లెందులోని శివ కేశవ సిమెంట్, ఐరన్ షాప్‌లో గురువారం తాపీ మేసీ్త్రలతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మార్కెట్‌లో లభించే ఇతర రకాల సిమెంట్‌తో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తవుతుందని తెలిపారు. ముఖ్యంగా శ్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి ఈ సిమెంట్ ఉత్తమమైందని పేర్కొన్నారు. జెర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ ల్యాబ్, టాంపరింగ్ ఫ్రూఫ్ బ్యాగ్‌తో సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. భారతి సిమెంట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సహాయం అందజేస్తామని, స్లాబ్ కాంక్రిట్ సమయంలో నిపుణులైన ఇంజనీర్లు సైట్ వద్దకే వచ్చి సహాయ పడుతారని తెలిపారు. ఈ సందర్భంగా 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ఉచిత ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. కార్యక్రమంలో డీలర్ శ్రీకాంత్, తాపీ మేసీ్త్రలు పాల్గొన్నారు.
తాపీ మేసీ్త్రల సమావేశంలో ఇంజనీర్ సాగర్ రెడ్డి