చంద్రాయపాలెం వర్సెస్‌ బుగ్గపాడు వర్సెస్‌ రుద్రాక్షపల్లి.. | - | Sakshi
Sakshi News home page

చంద్రాయపాలెం వర్సెస్‌ బుగ్గపాడు వర్సెస్‌ రుద్రాక్షపల్లి..

Apr 2 2024 12:35 AM | Updated on Apr 2 2024 2:46 PM

- - Sakshi

భూములు తమవేనని చెబుతున్న చంద్రాయపాలెం గిరిజనులు, పాస్‌పుస్తకాలు ఉన్నాయంటున్న బుగ్గపాడు, రుద్రాక్షపల్లి గిరిజనులు

పోలీసులపై దాడితో పికెట్‌ ఏర్పాటు

సామ్యేలు, మహేంద్ర సహా పలువురిపై హత్యాయత్నం కేసులు

భూవివాదం తేల్చాల్సిందెవరన్న అంశంపై అస్పష్టత

వరుస అరెస్టులతో గిరిజనుల్లో భయం

ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో పోడు భూముల వివాదం శాంతిభద్రతల సమస్యగా మారింది. ఈ గ్రామంలో సర్వే నంబర్‌ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్ట్టార్ల భూమిపై హక్కు కోసం స్థానిక, స్థానికేతర గిరిజనులు ఆదివారం గొడవ పడుతుండగా అడ్డుకునేందుకు వెళ్లిన సీఐ కిరణ్‌, సిబ్బందిపై దాడి చేసిన విష యం విదితమే. ఈ ఘటనతో ఏర్పాటుచేసిన పోలీ సు పికెట్‌ సోమవారం కూడా కొనసాగగా పోలీసులపై దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న గిరిజనులను గుర్తించి అరెస్ట్‌ చేస్తున్నారు.

ఆదివారం రాత్రే 20మంది గిరిజన మహిళలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈమేరకు ఐదు కేసులు నమోదు చేయగా, మద్దిశెట్టి సామేలు, కూరం మహేంద్రతో పాటు ఇంకొందరిపై కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లు కూడా చేర్చినట్లు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఇక సోమవారం మద్దిశెట్టి సామ్యేలు, మహేంద్ర సహా 26మందిని అరెస్ట్‌ చేయగా ఇప్పటివరకు 46మందిని అరెస్ట్‌ చేసినట్లయింది.

15 ఏళ్ల నుంచి..
చంద్రాయపాలెం గిరిజనులకు బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, నాగుపల్లి గ్రామాల గిరిజనుల నడుమ ఈ భూమిపై 15 ఏళ్ల నుంచి వివాదం నడుస్తోంది. అయినా అటవీ, రెవెన్యూ శాఖ అధికారులు సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోకపోవడంతోనే గొడవ జఠిలమైంది. చంద్రాయపాలెం గిరిజనులతో కలిసి 400 హెక్టార్లతో వీఎస్‌ఎస్‌ – అటవీ శాఖ సంయుక్తంగాజామాయిల్‌ సాగు చేస్తుండగా సుమారు 9 హెక్టార్లలో జామాయిల్‌ కట్‌ చేసి తిరిగి ప్లాంటేషన్‌కు సిద్ధమవుతుండడంతో వివాదం తీవ్రమైంది.

అటవీ శాఖ అధికారులు చంద్రాయపాలెం గిరిజనులను ముందుపెట్టి సమస్యను వారే తేల్చుకోవాలన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. భూమిపై తమకే హక్కులు ఉన్నాయని చంద్రాయపాలెం గిరిజనులు వాదిస్తున్నారు. అయితే 1970 కంటే పూర్వం తమ తాతముత్తాతలు సాగు చేసినట్లు హక్కు పత్రాలు ఉన్నాయని స్థానికేతర గిరిజనులు చెబుతున్నారు. ఏదిఏమైనా రెండు శాఖల సమన్వయంతో పోడు వివాదం తీవ్రమైందని విమర్శలు వస్తున్నాయి.

అధికారులు ఏమన్నారంటే..
చంద్రాయపాలెం 400 హెక్టర్ల భూమి ముమ్మాటీకి అటవీ శాఖదేనని రేంజర్‌ స్నేహలత తెలిపారు. వీఎస్‌ఎస్‌–అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యాన 9 హెక్టార్లలో జామాయిల్‌ కటింగ్‌ పూర్తయిందని, ఈసారి అటవీ శాఖ ఆధ్వర్యంలో మారుజాతి మొక్కలను పెంచేందుకు భూమి చదును చేశామన్నారు. ఈ విషయంలో చంద్రాయపాలెం గిరిజనులకు కానీ ఇతర ప్రాంత గిరిజనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదేవిషయమై సత్తుపల్లి తహసీల్దార్‌ యోగేశ్వరరావు స్పందిస్తూ చంద్రాయపాలెంలోని అటవీ భూమికి రెవెన్యూ శాఖతో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. భూవివాదాలను అట వీ శాఖతో కలిసి పరిష్కరించుకోవాలే తప్ప జాయింట్‌ సర్వే నిర్వహించలేదని స్పష్టం చేశారు.

ఇవి చదవండి: విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement