కోళ్లు.. పలు రకాలు | - | Sakshi
Sakshi News home page

కోళ్లు.. పలు రకాలు

Jan 14 2024 12:08 AM | Updated on Jan 14 2024 12:08 AM

పందెం కోళ్లలో అనేక రకాలు ఉన్నాయి. ప్రధానంగా కోడి ఈకల రంగు ఆధారంగా కోడి రకాన్ని గుర్తిస్తారు. సేతు, డేగ, నెమలి(ఎర్ర నెమలి, నల్ల నెమలి), కాకి(నల్లకాకి, పచ్చకాకి), పర్ల(తెల్ల పర్ల, కాకిడేగ పర్ల,), రసంగి(నెమలి రసంగి), కిక్కిరాయి(ఎర్ర కిక్కిరాయి, తెల్ల కిక్కిరాయి), మైల, తెల్లఅబ్రాస్‌, కౌజు, మైల, పింగళ, ఎర్రపూల కోడి, బెరస.. తదితర పేర్లతో వీటిని పిలుస్తుంటారు. నల్ల ఈకలు ఉన్న పుంజును కాకి అని, తెల్లని ఈకలు ఉంటే దానిని సేతు అని, మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే పర్ల అని, శరీరం నల్లగా ఉండి, రెండు లేదా మూడు రంగుల ఈకలు ఉంటే దానిని కొక్కిరాయి అని వ్యవహరిస్తారు. ఇక ఈకలు మొత్తం ఎర్రగా ఉంటే డేగ అని, రెక్కలపై లేదా వీపుపై పసుపు రంగు ఈకలు ఉంటే నెమలి అని, మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో సమానంగా ఉంటే దానిని కౌజుగా, ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటే మైల అని, రెక్కలు ఎక్కువ తెలుపు రంగులో ఉంటే పింగళ అని, బంగారు రంగులో ఈకలు ఉంటే అబ్రాసు అని పిలుస్తారు. అయితే, ప్రధానంగా డేగ, కాకి, నెమలి రకాలనే కోడి పందేల్లో ఉపయోగిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement