పెళ్ళైన కొన్ని నెలలకే.. | - | Sakshi
Sakshi News home page

పెళ్ళైన కొన్ని నెలలకే..

Oct 10 2023 12:40 AM | Updated on Oct 10 2023 10:26 AM

- - Sakshi

హరిచందన (ఫైల్‌)

ఖమ్మం: డెంగీ జ్వరం బారిన పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. వైరాకు చెందిన వ్యాపారి అనుమోలు చంద్రయ్య కుమారుడు రాజేష్‌కు ఈ ఏడాది మే 30న ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరానికి చెందిన హరిచందన(23)తో వివాహం జరిగింది.

మూడు రోజుల క్రితం ఆమె జ్వరంతో బాధపడుతుండగా వైరాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించినా ఫలితం లేక హైదరాబాద్‌ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయిస్తుండగానే ఆమె సోమవారం మృతి చెందింది. వివాహం జరిగిన నాలుగున్నర నెలలకే హరిచందన మృతి చెందగా, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహం వద్ద బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ తదితరులు నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement