ప్రాణం తీసిన ఈత సరదా | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఈత సరదా

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

హొససేటె: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణాలను బలి తీసుకుంది. కాలువలో స్నానానికి వెళ్లిన ఇద్దరు బాలురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. విజయనగర జిల్లా హొసపేటె తాలూకా బుక్కసాగర గ్రామ సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు విగతజీవులుగా మారడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. బళ్లారి జిల్లా కురుగోడు తాలూకా హెచ్‌.వీరాపుర గ్రామానికి చెందిన సతీష్‌(16), ఫక్కీరప్ప(12) అనే ఇద్దరు బాలురు మునిరాబాద్‌ సమీపంలోని హులిగమ్మ దేవి ఆలయ దర్శనం అనంతరం తిరిగి వస్తూ బుక్కసాగర గ్రామంలోని తమ నానమ్మ ఇంటికి వెళ్లి బస చేశారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న ఎల్లెల్సీ కాలువలో స్నానానికి వెళ్లారు. అయితే కాలువలో లోతు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో నీటి ఒరవడిలో చిక్కుకుని ఇద్దరూ మునిగిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కాలువలోకి దిగి గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. చేతికి అందివచ్చిన పిల్లలు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనపై కమలాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఎల్లెల్సీలో మునిగి ఇద్దరు బాలుర మృతి

బుక్కసాగర గ్రామంలో విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement