అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

బళ్లారి రూరల్‌: నగరంలోని పాత సిటీ కార్పొరేషన్‌ కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయాలకు మధ్య ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌పైకి అదుపుతప్పి ఎన్‌ఈకేఆర్‌టీసీ సిటీ బస్సు దూసుకెళ్లిన ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకొంది. బళ్లారి 3వ డిపోకు చెందిన బసవేశ్వరనగర్‌ నుంచి ఓపీడీకి వెళ్లే ఆర్‌టీసీ బస్సు రాయల్‌ సర్కిల్‌ సమీపంలోని హోటల్‌ రేణుకా దర్శన్‌ ఎదురుగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం పక్కన గల ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వైపు అదుపు తప్పి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా బస్సు పక్కకు వెళ్తుండటంతో ప్రజలు తత్తరపాటుకు గురై పరుగులు తీశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు ముందు నిల్చున్న ద్విచక్ర వాహనాలపైకి వెళ్లి దుకాణాల ముందున్న చిన్నపాటి గోడను ఢీకొట్టింది. మరికొంత ముందుకు వెళ్లి ఉంటే గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి దిగిపోయే ప్రమాదం ఉండేది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ ముందున్న 8 బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి. హెల్మెట్లు అమ్ముకొంటున్న వ్యాపారి పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. 20 హెల్మెట్లు పాడయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు బ్రేకులు ఫెయిలైనందున బస్సు అదుపు తప్పిందని స్థానికులు చెబుతుండగా బస్సు డ్రైవర్‌ నాగరాజుకు అనారోగ్యంతో తల తిరగడం వల్లే బస్సు పక్కకు వెళ్లిందని చెబుతున్నారు. బస్సు డ్రైవర్‌ నాగరాజు బీఎంసీఆర్‌సీ ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. బ్రూస్‌పేటె పోలీసులు కేసు నమోదు చేసుకొని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

దుకాణాల వైపు దూసుకెళ్లిన వైనం

8 బైక్‌లు, 20 హెల్మెట్లు నుజ్జునుజ్జు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement