బంగారం చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

బంగారం చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్‌

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

రాయచూరు రూరల్‌: నగరానికి ఐదు కి.మీ.ల దూరంలోని యరమరస్‌లో 60 తులాల బంగారం చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. శనివారం రాత్రి ఆది బసవేశ్వర కాలనీలో నివాసముంటున్న విజయలక్ష్మి ఇంటిలో దొంగలు పడి 40 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.70 వేల నగదును దోచుకుని పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా నగరంలోని చంద్రబండ రహదారిలో అమర్‌సింగ్‌(29), ధన్‌రాజ్‌ సింగ్‌(24)లను అరెస్ట్‌ చేశామన్నారు. ఏఎస్పీ హరీష్‌, డీఎస్పీ శాంతవీర, సీఐలు ఉమేష్‌, నింగప్ప, ఎస్‌ఐలు నారాయణ, మంజునాథ్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement