పిల్లలకు విటమిన్‌ ఏ చుక్కలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు విటమిన్‌ ఏ చుక్కలు తప్పనిసరి

Nov 18 2026 1:44 AM | Updated on Nov 18 2026 1:44 AM

హొసపేటె: పిల్లల్లో కంటి చూపు మెరుగుపడటంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్‌ ఏ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఎంపీ దొడ్డమని అన్నారు. ఆయన హొసపేటె తాలూకా బసవనదుర్గ గ్రామంలో గ్రామ ఆరోగ్య, పారిశుధ్య, పోషకాహార కమిటీతో పాటు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విటమిన్‌ ఏపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఐదేళ్ల లోపు వయస్సు పిల్లలందరికీ నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం విటమిన్‌ ఏ ద్రావణాన్ని తప్పనిసరిగా అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. విటమిన్‌ ఏ లోపంతో చిన్నారుల్లో కంటి చూపు మందగించడం, రే చీకటి, కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. డయేరియా, న్యుమోనియా వంటి వ్యాధుల బారి నుంచి రక్షణ పొందేందుకు విటమిన్‌ ఏ ఎంతో అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది మంజునాథ్‌, శశిరేఖ, దేవేంద్ర తళవార్‌, శ్రీపతి, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement