శివాజీనగర: బీఎంటీసీ బస్సులపై పొగాకు ప్రకటనలను నిషేఽధించే యోచన ఉందని ఆరోగ్య శాఖ మంత్రి యూ.టీ.ఖాదర్ తెలిపారు. పొగాకు ఉత్పత్తుల ప్రచారాన్ని అరికట్టాల్సి ఉందన్నారు. నగరంలో విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. పొగాకు ఉత్పత్తుల హోర్డింగ్‌లపై సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. ఐటీ–బీటీ కంపెనీలలో వేధింపుల ముఠాలు, ధూమపాన సమస్య నివారణకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బహిరంగ ధూమపానంపై ఉన్న రూ.100 జరిమానాను పెంచే ప్రతిపాదన లేదన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది సమయపాలన కోసం యాప్ ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేశామని తెలిపారు.
మంత్రి ఖాదర్


