పండుగ ముగిసె.. చెత్త మిగిలె.. | - | Sakshi
Sakshi News home page

పండుగ ముగిసె.. చెత్త మిగిలె..

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

బళ్లారి రూరల్‌ : పండుగలు వస్తే నగరవాసులు ఇళ్లల్లో, దుకాణాల్లో, వ్యాపార కేంద్రాల్లో పూజలకు, అలంకరణలకు పూలు, మామిడాకులు, అరటిపిలకలు అమ్మకానికి ప్రధాన రహదారుల్లో బారులు తీరతాయి. తీరా అమ్మకం కాని మిగిలిన వ్యర్థాలను రోడ్ల పక్కన అలాగే దిబ్బలుగా వదిలి వెళ్లిపోతారు. చివరకు పారిశుధ్య కార్మికులు టన్నుల కొద్ది వ్యర్థాలను తొలగించి కార్పొరేషన్‌ వాహనాలపై తరలించడానికి రెండు రోజులు పడుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం నరక చతుర్థశి, సోమవారం అమావాస్య, మంగళవారం దీపావళి మూడు రోజులు పెద్దసంఖ్యలో పూజలు, అలంకరణ సామగ్రి అమ్మకాలు జరిగాయి. అమ్మకం కాని మిగిలిన అరటి పిలకలు, పూలు తదితరాలను అలానే వదిలి వెళ్లడంతో మంగళ, బుధవారాలు కార్మికులు శుభ్రం చేసే పనిలో పడ్డారు. బెంగళూరు రోడ్డు, సంగం సర్కిల్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, దుర్గమ్మ గుడి వద్ద టన్నులకొద్దీ వ్యర్థాలను వాహనాల్లో తరలించినట్లు కార్మికులు వెల్లడించారు.

నగర వీధుల్లో పేరుకున్న

పూలు, అరటి పిలకలు

రెండు రోజులుగా టన్నులకొద్ది

వ్యర్థాల తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement