కుమారుడి మరణం.. తల్లి హఠాన్మరణం | - | Sakshi
Sakshi News home page

కుమారుడి మరణం.. తల్లి హఠాన్మరణం

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

● మాతాశిశు మరణంతో తీరని విషాదం

గుమ్మఘట్ట: మాతాశిశు మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ప్రసవించిన కొద్దిసేపటికే శిశువు మరణించగా, తట్టుకోలేకపోయిన తల్లి గంటల వ్యవధిలోనే ప్రాణం కోల్పోయింది. స్థానికులు తెలిపిన వివరరాలు.. గుమ్మఘట్ట మండలం తాళ్లకెరకు చెందిన లక్ష్మక్క, బొమ్మయ్య దంపతుల కుమారుడు రాజన్నకు కర్ణాటక రాష్ట్రం గుడేకోట సమీపంలోని అలుకుందిచెరువు గ్రామానికి చెందిన మనోదిత(22)తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించేవారు. మనోదితకు మొదటి కాన్పులో కుమారుడు జన్మించాడు. రెండోసారి గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం అలుకుందిచెరువు గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. మంగళవారం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున పండంటి మగబిడ్డను ప్రసవించింది. అయితే కొంతసేపటికే శిశువు చనిపోయాడు. దీన్ని తట్టుకోలేకపోయిన మనోదిత తీవ్ర అస్వస్థతకు గురైంది. మెరుగైన వైద్యం కోసం బళ్లారిలోని విమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగానే ప్రాణం విడిచింది. ఈ ఘటనతో పుట్టినింట.. మెట్టినింట విషాదఛాయలు అలుముకున్నాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement