అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య | - | Sakshi
Sakshi News home page

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

రాయచూరు రూరల్‌: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను ప్రియుడితో కలసి భార్య హత్య చేసింది. కలబురగి జిల్లా మల్‌ఖేడ్‌లో జరిగిన హత్యకు సంబంధించిన వివరాలు ఇలా.. మల్‌ఖేడ్‌ బస్టాండ్‌ సమీపంలో కంప్యూటర్‌ సెంటర్‌ నడుపుకునే సిద్ధరామకు భార్య అంబిక, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మారుతి అనే వ్యక్తితో అంబిక అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజూ భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి వారు కలిసేవారు. ఈ క్రమంలో ఓ రోజు భర్త సిద్ధరామకు మెలుకువ రావడంతో అక్రమ సంబంధం బయటపడుతుందని భయపడ్డారు. దీంతో ఎలాగైనా భర్తను చంపేయాలని ప్రియుడు మారుతితో కలసి అంబిక ప్లాన్‌ వేసింది. సిద్ధరామ నవంబర్‌ 2 రాత్రి బయటకు వెళ్లి నవంబర్‌ 3 ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత నిద్ర లేపేసరికి శరీరం చల్లబడిపోయి చనిపోయాడని అంబిక మొదట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లాడని మళ్లీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే సిద్ధరామ తల్లి బసమ్మ తన కొడుకు మృతదేహాన్ని పరిశీలించగా.. అతని మెడపై రక్కుడు గాయాలు, ముక్కు, చెవులు, నోటి నుంచి రక్తం రావడం గమనించింది. కోడలిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ప్రియుడు మారుతితో కలసి చంపేసినట్లు ఒప్పుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే భర్తను ప్లాన్‌ ప్రకారం హతమార్చినట్లు తెలిపారు. కలబురగి ఎస్పీ అద్దూరు శ్రీనివాసులు పర్యవేక్షణలో మల్‌ఖేడ్‌ పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితులను జైలుకు పంపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement