పెట్రోలులో అధిక ఇథనాల్‌ వాస్తవం | - | Sakshi
Sakshi News home page

పెట్రోలులో అధిక ఇథనాల్‌ వాస్తవం

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

శివాజీనగర: పెట్రోల్‌లో అధిక ఇథనాల్‌ కలుపుతున్నట్లు మేం జరిపిన పరీక్షల్లో వెల్లడైంది, ఈ నివేదికకు కట్టుబడి ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా పరిగణించి తగిన సమాధానం ఇవ్వాలి.. అని మంత్రి రిజ్వాన్‌ హర్షద్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వికాససౌధలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ లీగల్‌ మెట్రాలజీ అధికారులు వివిధ బంకుల్లో పెట్రోలును సేకరించి ఇథనాల్‌ శాతాన్ని పరీక్షించారని తెలిపారు. నమూనాల సేకరణ సరిగ్గా జరగలేదన్న ఆయిల్‌ కంపెనీల ఆరోపణలను మంత్రి తిరస్కరించారు. ప్రతి నమూనాను సంబంధిత అధికారులకు అందజేసి ప్రయోగశాలకు పంపినట్లు చెప్పారు. ఇథనాల్‌ గాఢతతో సహా అన్ని పరీక్షలు నిబంధనల ప్రకారమే నిర్వహించామన్నారు. ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ బంకులలో హైడ్రోమీటర్లను ఉపయోగించి అక్కడే ఇథనాల్‌ శాతాన్ని పరీక్షిస్తూ హంగామా చేస్తున్నాయని విమర్శించారు. ఇథనాల్‌ను పరీక్షించేందుకు రాష్ట్రంలో సరైన ల్యాబ్‌లు లేవని బీజేపీ నేత ఆర్‌.అశోక్‌ ఆరోపణలను కొట్టిపారేశారు. పెట్రోలులో 30 శాతం ఇథనాల్‌ను ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి స్వయంగా చెప్పారని రిజ్వాన్‌ హర్షద్‌ అన్నారు. కేంద్రమంత్రి అబద్ధం చెబుతారా? అని ప్రశ్నించారు. కేంద్ర సర్కారు ప్రజలకు నిజం చెప్పాలన్నారు.

కాంగ్రెస్‌ నిరసన

కేంద్ర ప్రభుత్వం పెట్రోలులో అధిక ఇథనాల్‌ను కలుపుతోందని ఆరోపిస్తూ సోమవారం బెంగళూరులో నటరాజ్‌ సినిమా వద్ద పెట్రోల్‌ బంకు ముందు కాంగ్రెస్‌ అధ్వర్యంలో నిరసన నిర్వహించారు. 7 జిల్లాల్లో 60 పెట్రోల్‌ బంకుల నమూనాలను ల్యాబ్‌లో పరీక్షిస్తే 30 శాతంపై ఇథనాల్‌ ఉన్నట్లు నిరూపణ అయ్యిందన్నారు. అధిక ఇథనాల్‌ కారణంగా వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు తరచూ ఇంజన్‌ సమస్యలు, మరమ్మతులు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెంటనే నిజానిజాలు వెల్లడించాలని, పరిహారం చెల్లించాలని, ఆయిల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కాగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి తరలించారు.

కేంద్రం ప్రజలకు నిజాలు చెప్పాలి

మంత్రి రిజ్వాన్‌ హర్షద్‌ డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement