మైసూరు శివార్లలో పెద్ద పులి గుబులు | - | Sakshi
Sakshi News home page

మైసూరు శివార్లలో పెద్ద పులి గుబులు

Nov 10 2026 12:07 AM | Updated on Nov 10 2026 12:07 AM

మైసూరు: మైసూరు నగర శివార్లలోని మండకల్లి విమానాశ్రయం వద్ద, నంజనగూడు రోడ్డులో తోటలు, బంజరు భూముల్లో పెద్ద పులి సంచరిస్తోంది. బండీపుర అడవుల నుంచి ఇది వచ్చినట్లుగా అనుమానాలున్నాయి. మండకల్లి, మారేసు, హోసహుండి, గూడూమదనహళ్లి గ్రామం, జేపీ నగరలను కలిపే వంతెన సమీపంలో వారం రోజులుగా ఒక పులి తిరుగుతూ ఉండగా చూసిన గ్రామస్థులు కలవరం చెందుతున్నారు. కొన్ని నెలల క్రితం, మండకల్లి విమానాశ్రయం దగ్గర పులి కనిపించగా, అటవీ అధికారులు బోనులు పెట్టినా అది చిక్కలేదు. కొన్ని రోజుల తర్వాత, అదే పులి బెమెల్‌ ప్రాంగణంలో తిరుగాడింది. ఇప్పుడు గ్రామస్తులు, తోటల యజమానులు, కూలీలు పొలాలకు వెళ్లడానికి భయపడుతున్నారు. రాత్రిపూట తిరిగే పులి ఇప్పుడు పగటివేళల్లో కూడా పొలాల్లోకి వస్తోందని రైతులు వాపోయారు. పులి పట్టివేతకు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని డీసీఎఫ్‌ పరమేశ్‌ తెలిపారు.

రాత్రివేళ మహదేశ్వర

కొండకు వద్దు

మైసూరు: దీపావళి జాతర నేపథ్యంలో, చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలో దట్టమైన అడవుల్లో ఉన్న మలే మహదేశ్వర కొండ ఆలయానికి యాత్రికులు పాదయాత్రగా వస్తున్నారు. అయితే రాత్రిపూట పాదయాత్ర, కొండ ట్రెక్కింగ్‌ను నవంబర్‌ 11 వరకు అటవీ అధికారులు నిషేధించారు. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి తలబెట్ట నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకూ నడిచి వెళ్లరాదు. పులులు, చిరుతలు, ఏనుగులు వంటి వన్యమృగాలు దాడులు చేసే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టరు శ్రీరూప తెలిపారు. గతంలోనూ యాత్రికులపై జంతువులు దాడులు చేశాయి.

విమానాశ్రయం సహా పలు

ప్రాంతాల్లో సంచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement