కుల, వర్గ, వర్ణ బేధాలకు తావు వద్దు | - | Sakshi
Sakshi News home page

కుల, వర్గ, వర్ణ బేధాలకు తావు వద్దు

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక సమాజంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని సాంఘీక న్యాయానికి అందరూ సహకరించి, కుల, వర్గ, వర్ణ బేధాలకు తావ్విరాదని రాష్ట్ర అదనపు డీఐజీ హరిశేఖరన్‌ పిలుపునిచ్చారు. మంగళవారం సాంఘీక సంక్షేమ శాఖ కార్యాలయంలో జిల్లా పాలన, జడ్పీ, సాంఘీక సంక్షేమ శాఖ, నగరసభ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై జరిగిన సమావేశంలో మాట్లాడారు. న్యాయసమ్మతమైన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సముదాయం అధికంగా ఉందని, వారి అభివృద్ధికి తోడు దౌర్జన్యాల నియంత్రణలో అధికారులు బాధ్యతగా మెలగాలన్నారు. నవీన్‌ కుమార్‌, కరిబసన గౌడ, జిల్లాధికారి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి, జడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో, సర్కారీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, రవి, విజయ రాణి, శేఖర్‌, వెంకటేష్‌ నాయక్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement