15 నుంచి జిల్లా కసాప సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

15 నుంచి జిల్లా కసాప సమ్మేళనం

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

రాయచూరు రూరల్‌: నగరంలో ఈ నెల 15 నుంచి రెండు రోజుల పాటు జిల్లా కన్నడ సాహిత్య పరిషత్‌(కసాప) 12వ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు సమ్మేళనం కార్యాధ్యక్షుడు బోసురాజు పేర్కొన్నారు. మంగళవారం ప్రైవేట్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కసాప జిల్లా సమ్మేళనం లాంఛనాన్ని విడుదల చేసి ఆయన మాట్లాడారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో సమ్మేళనాన్ని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌ ప్రారంభిస్తారన్నారు. జిల్లా సమ్మేళనం సర్వాధ్యక్షుడిగా రామణ్ణ హవళే ఎంపికై నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, రంగణ్ణ పాటిల్‌, శాంతప్ప, జయన్న, బాబు భండారిగళ్‌, వీర హనుమాన్‌, రావుత్‌ రావ్‌, సంతోష్‌, బసవ ప్రభు, తాయప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement