వేర్వేరు చోట్ల మృత్యు పంజా | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల మృత్యు పంజా

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

రాయచూరు రూరల్‌ : కొప్పళ, రాయచూరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. మూడు రోజుల కిత్రం కొప్పళ జిల్లా గంగావతి నివాసి అమర్‌ చౌహాన్‌ అనే వ్యక్తితో అతని భార్య గొడవ పడింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో ఆమె పిల్లలను వదిలి కొప్పళలోని పుట్టింటికి వెళ్లింది. దీంతో అమర్‌ చౌహాన్‌(36), తన కుమారులు అమన్‌(8), అయాన్‌(6)లతో కలిసి తన భార్యను పిలుచుకు రావడానికి ద్విచక్ర వాహనంలో కొప్పళకు బయల్దేరారు. మార్గమధ్యంలో గిణిగేర వద్ద జాతీయ రహదారిలో గంగావతి వైపు నుంచి కొప్పళకు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై గంగావతి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బొలెరో ఢీకొని మహిళ మృతి

రాయచూరు జిల్లా మస్కి తాలూకా మూడలదిన్నికి చెందిన హనుమమ్మ(45) అనే మహిళ మరణించింది. మంగళవారం లింగసూగూరు నుంచి మస్కికి ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం అదుపు తప్పి ఢీకొనడంతో వెనుక వైపు కూర్చొన్న మహిళ మరణించగా, వాహనం నడుపుతున్న కుమార్‌(23)కు గాయాలయ్యాయి. ఘటనపై మస్కి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నెత్తురోడిన రహదారులు

ప్రమాదాల్లో నలుగురు మృతి

పిడుగుపాటుకు రైతు మృతి

జిల్లాలోని మాన్వి తాలూకాలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై రైతు ప్రభు(50) మృతి చెందారు. మాన్వి తాలూకాలోని అర్నళ్లిలో పొలంలో పనులు చేస్తుండగా పిడుగులు పడడంతో రైతు అక్కడికక్కడే మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement