రోడ్డు ప్రమాదాలపై బీజేపీ కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై బీజేపీ కన్నెర్ర

Nov 4 2026 3:14 AM | Updated on Nov 4 2026 3:14 AM

సాక్షి,బళ్లారి: నగరంలో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పలువురు మృతి చెందుతూ, ఎందరో గాయపడుతున్నారని, అనుమతి లేకుండా పగటి వేళలో లారీలు, టిప్పర్ల సంచారంతో నగరంలో రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయని బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి ఆధ్వర్యంలో బండిమోట్‌ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున జనం చేరడంతో వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. నేతలు మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా పోలీసులు పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం పగటి వేళల్లో లారీలు, టిప్పర్లు ఇష్టానుసారంగా సంచరించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటోందన్నారు. నగరంలో పగటి సమయంలో లారీల సంచారాన్ని నిషేధించాలన్నారు.

భారీ వాహనాలను మళ్లించాలి

భారీ వాహనాల రాకపోకల కోసం ఇప్పటికే నగర శివార్లలో ప్రత్యేక రహదారుల సౌకర్యం కల్పించారని, అయినా లారీలు నగరంలో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తుండం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే లారీలను నగరంలోనికి అనుమతించాల్సి వస్తే రాత్రి 10 గంటల తర్వాత అనుమతి ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ నిబంధనలకు వ్యతిరేకంగా లారీలు సంచరిస్తే ఆయా లారీలను సీజ్‌ చేయాలని సూచించారు. పెద్ద ఎత్తున జనం చేరి ఆందోళన చేయడంతో ఏపీఎంసీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఇకపై నగరంలో అనుమతి లేని భారీ వాహనాలు, టిప్పర్లు తిరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పగటి వేళల్లో లారీలు, టిప్పర్ల

సంచారం నిషేధించాలి

రోడ్డుపై బైఠాయించి శ్రీరాములు, గాలి సోమశేఖరరెడ్డి తదితరుల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement