చెరువులోకి పడి ఇద్దరు బాలికలు.. | - | Sakshi
Sakshi News home page

చెరువులోకి పడి ఇద్దరు బాలికలు..

Oct 27 2026 12:15 AM | Updated on Oct 27 2026 12:15 AM

యశవంతపుర: బట్టలు ఉతకడానికి వెళ్లి ఇద్దరు బాలికలు చెరువులోకి జారి పడి మృతి చెందిన ఘటన ఉడుపి జిల్లా కుందాపుర తాలూకా హొసాడు గ్రామం కొప్పరి గుడ్డెలో ఆదివారం సాయంత్రం జరిగింది. ముళ్లికట్ట జోపడిలో హావేరి జిల్లా శిగ్గావికి చెందిన వలస కూలీలు చంద్రు బసవరాజ కూతురు సునీత (13), మంజునాథ– శారద దంపతుల బిడ్డ వైశాలి (13) ఐదుమంది చిన్నారులతో కలిసి కడుబి చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లారు. సునీత, వైశాలిలు జారి లోతైన ప్రాంతంలో పడ్డారు. ఈతరాని కారణంగా గట్టుకు రాలేక మునిగిపోయారు. మిగతా బాలలు వచ్చి తల్లిదండ్రులకు చెప్పగా, పోలీసులకు సమాచారమిచ్చారు. ఫైర్‌ సిబ్బంది కొన్ని గంటలపాటు గాలించి మృతదేహాలను వెలికితీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement