శివమొగ్గ: జిల్లాలో గాజనూరులోని తుంగ నదిలో ఈతకు వెళ్లిన శివమొగ్గకు చెందిన ఇద్దరు యువకులు జలసమాధి అయ్యారు. నదీమ్ (23),, అయాన్ (15), సెలవు కావడంతో ఆదివారం సాయంత్రం సమీపంలోని తుంగా డ్యాం విహారానికి వెళ్లారు. జలాశయం పక్కన ప్రవహిస్తున్న నీటిలో ఈతకు దిగారు. వారిద్దరూ ప్రవాహంలో చిక్కి గల్లంతయ్యారు. ఈ ఘటన గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది చేరుకుని గాలింపు చేపట్టారు. ఇద్దరి మతదేహాలు లభ్యమయ్యాయి. తుంగా నగర పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది.


