మండ్య: రేకుల కుప్పలా మారిపోయిన ఈ రూపం ఓ కారుదే. మండ్య జిల్లాలోని హలగూరులో ఆదివారం ఉదయం బనసముద్ర గేటు సమీపంలో కారు అతివేగంగా పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. బెంగళూరులోని శాంతినికేతన్ లేఅవుట్‌లో నివసించే ఇంజనీరు ఈనోస్ బిన్ టైటస్, స్నేహితులు అభిషేక్, ప్రణవ్‌లతో కలిసి పలు పర్యాటక ప్రాంతాలను వీక్షించి బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. తుక్కు తుక్కుగా మారిన కారును స్థానికులు ఆశ్చర్యంగా వీక్షించారు.


