ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

రాయచూరు రూరల్‌: ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గంలోని ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పందించి పరిష్కరిస్తామని విధాన పరిషత్‌ సభ్యుడు వసంత కుమార్‌ పేర్కొన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలబుర్గి ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శరణప్ప మట్టూరు పరంగా ఓటర్లు ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలో ఉన్నందున సమస్యల సత్వర పరిష్కారానికి తమ పార్టీ అభ్యర్థికే మెరుగైన అవకాశాలుంటాయన్నారు. బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో కూడా ఓట్ల చోరీకి పాల్పడాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హిందూ మతం పేరుతో ఓట్లను రాబట్టుకోడానికి కుట్రలు పన్నినా ఫలితం లేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై విధాన పరిషత్‌ కార్యకలాపాల్లో కూలంకషంగా చర్చించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement