ఘనంగా మధ్వాచార్య జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మధ్వాచార్య జయంతి

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

హొసపేటె: విజయనగర జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జగద్గురు మధ్వాచార్య జయంతి వేడుకలను నగరంలోని జిల్లాధికారి కార్యాలయ ఆడిటోరియంలో నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ పీఎన్‌.లోకేష్‌ పాల్గొని జగద్గురు మధ్వాచార్యుల చిత్రపటానికి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించారు. భారతీయ ఆధ్యాత్మీక, తాత్విక సంప్రదాయాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న జగద్గురు మధ్వాచార్యుల సేవలను స్మరించారు. ఆయన బోధనలు తరతరాలుగా భక్తులకు, ఆధ్యాత్మిక సాధకులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. మధ్వ సంఘం నాయకులు, ప్రముఖులు శ్రీనంభట్‌ గురురాజ్‌ దిగ్గావి, ప్రభాకర్‌రావు, నరసింహా ఆచార్య, కల్లంభట్‌, చంద్రకాంత్‌ కామత్‌, ఉమేష్‌, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement