బనశంకరి: దేవీ నవరాత్రుల సందర్భంగా యలహంకలోని చౌడేశ్వరీ దేవి ఆలయంలో సోమవారం అమ్మవారిని శ్రీవైష్ణవీ దేవిగా అలంకరించారు. ఉదయం నుంచి ఫల పుష్పా నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు గావించారు. పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కస్టమ్స్ అధికారి మద్యం
దందా.. కేసు
బనశంకరి: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో పనిచేసే కస్టమ్స్ అధికారి పై కేసు నమోదు చేయాలని లోక్‌పాల్.. సీబీఐకి సోమవారం ఆదేశించింది. అధికారి ఆంథోని రాజ్ గతంలో ఎయిర్‌కార్గో కాంప్లెక్స్‌లో పనిచేసేవాడు. అంతర్జాతీయ ప్రయాణికుల పాస్‌పోర్టులను బలవంతంగా తీసుకుని ఖరీదైన పన్ను రహిత మద్యాన్ని అక్రమంగా కొనేవాడు. ఈ మేరకు ఓ ప్రయాణికుడు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎంతో మంది ప్రయాణికుల పేర్లతో మద్యం కొనుగోలు చేసి, అందుకు ప్రతిగా వారికి ఏవో కానుకలు ఇచ్చేవాడు. 2026 ఫిబ్రవరి 13న లోక్‌పాల్ ధర్మాసనం, కేంద్ర జాగృతి కమిషన్ (సీవీసీ) ప్రాథమిక దర్యాప్తు చేపట్టి, ఈ బాగోతంపై 4 వారాల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. ఆంథోని రాజ్‌పై కేసు నమోదు చేయాలని అధికారులకు ఆదేశించింది.
యత్నాల్, విజయేంద్ర భేటీ
సాక్షి,బళ్లారి: బీజేపీ బహిష్కృత విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ తరచూ యడియూరప్ప, కుమారుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రను విమర్శించడం తెలిసిందే. దాని వల్లే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడం విదితమే. ఆశ్చర్యకరంగా హుబ్లీలో యత్నాల్, విజయేంద్ర భేటీ అయ్యారు. శబ్బి గ్రామంలో జైన మత కార్యక్రమం ముగించుకొని పరిచయస్తుల ఇంట్లో యత్నాల్ ఉండగా, అక్కడకు విజయేంద్ర కూడా వచ్చారు. ఇద్దరు క్షేమ సమాచారాలు మాట్లాడుకొన్నారు. కాగా యత్నాల్‌ను తిరిగి బీజేపీలోకి చేర్చుకుంటారా అనే చర్చ మొదలైంది.
పోకిరీ బైక్‌రైడర్
యశవంతపుర: బెంగళూరులో ర్యాపిడో పింక్ బైక్ రైడర్ మహిళను సతాయించాడు. మహిళ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ బయట జరిగింది. నిశ్చేష్టురాలైన మహిళ 15 నిమిషాల పాటు అలాగే నిలబడిపోయింది. సృష్టి అనే ఓ మహిళ ఈ తతంగాన్ని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మహిళను పికప్ చేసుకోవడానికి ఆమె ఇంటికి వచ్చిన హెల్మెట్ ఇస్తూ రైడర్ ఆమె చేయి పట్టుకున్నాడని తెలిపింది. దీంతో ఆమె తీవ్ర కంగారుకు గురైంది. ఇలాంటి రైడర్ల వల్ల మహిళల భద్రత ప్రశ్నార్థకం అవుతోందన్నారు.
నెలాఖరులోగా పదవుల పందేరం: బీకే
బనశంకరి: ఈ నెలాఖరులోగా వివిధ కార్పొరేషన్ల పదవులకు నియామకాలు చేపడతామని కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ చెప్పారు. సోమవారం కేపీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నేత సుర్జేవాలా కొందరి పేర్లను ఆమోదించారని, 4 రోజుల తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగుస్తుందని, ఈ నెలాఖరులోగా పేర్లు ప్రకటిస్తామన్నారు. చాలా డైరెక్టర్లు, సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయన్నారు.
తాలూకా వైద్యులకు అలర్ట్
●నవంబరు 1 నుంచి రాత్రి 9కి యాప్‌లో హాజరు
● వైద్య ఆరోగ్యశాఖ ఆదేశం
శివాజీనగర: రాష్ట్రంలో తాలూకా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు నవంబర్ 1 నుంచి ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు కర్తవ్య యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం తప్పనిసరి. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం కోసం, వైద్యసేవలను నిరంతరం అందించడానికి ఆరోగ్య శాఖ ఈ ఉత్తర్వును జారీ చేసింది. ఇందుకోసం యాప్‌లో జియో ఫెన్సింగ్ సహా పలు అంశాలను తీర్చిదిద్దారు. ఎక్కడో ఉండి హాజరు వేస్తే చెల్లదు. ఆస్పత్రి లోపల, లేదా సమీపంలో ఉండి హాజరు ఇస్తేనే నిర్ధారిస్తుంది. తాలూకా లేదా గ్రామ స్థాయిలో పనిచేసే వైద్యులకు యాప్ హాజరు తప్పనిసరి.
సెలవులపై..
అలాగే పై అధికారుల అనుమతి లేకుండా ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకూడదని ఉత్తర్వులిచ్చింది. అందుబాటులో లేని వైద్యులపై కఠినమైన క్రమశిక్షణ తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సెలవును ముందే యాప్‌లో నమోదు చేసుకోవాలి. జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారులు యాప్ హాజరును ప్రతి నెలా ధ్రువీకరిస్తారు.


