శివాజీనగర: కర్ణాటక చెరకు రైతుల డిమాండ్లను నెరవేర్చాలని సీఎం డీ.కే.శివకుమార్ ప్రధాని నరేంద్ర మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ‘చెరకు రైతుల నిరసన కారణంగా ఉత్తర కర్ణాటకలో చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభం ఆలస్యమవుతోంది. వేలాది రైతు కుటుంబాలలో అనిశ్చితిని సృష్టించింది. పంట కోతకు సిద్ధంగా ఉన్నప్పటికీ, చెరకు ఇంకా పొలాల్లోనే ఉంది. క్రషింగ్ ఆలస్యమయ్యే కొద్దీ చెరకు బరువు, చక్కెర శాతం తగ్గుతుంది. రైతుల శ్రమ వృథా అవుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి కేజీ చెరకు ధర రూ.31గా ఉందని, దానిని పెంచాలని కోరారు. చక్కెర కనీస విక్రయ ధరను కూడా పెంచితే పరిశ్రమలకు గిట్టుబాటు అవుతుందని సీఎం సూచించారు. ఇథనాల్ ధరను కూడా పెంచాలని, దీనివల్ల చక్కెర కర్మాగారాలకు వెసులుబాటు లభిస్తుందన్నారు. మరోవైపు ఉత్తర కర్ణాటకలో చెరకు రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి.
చెరకు, చక్కెర, ఇథనాల్ ధరలను పెంచండి
సీఎం డీకే శివకుమార్ లేఖ


