సవరణలకు ఎక్కువ దరఖాస్తులు
శివాజీనగర: కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ తుది దశకు చేరుకుందని, మొత్తం 43.82 లక్షల నోటీసుల్లో 19,365 మాత్రమే ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఇప్పటివరకు 43.63 లక్షల విచారణలు పూర్తయ్యాయి. అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 22 చివరి రోజు కాగా, తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 27న ప్రకటిస్తారు. సర్ పేరిట కోట్లాది మంది ఓటర్లను తొలగిస్తున్నారని సీఎం డీకే శివకుమార్, మంత్రులు బెంగళూరులో ఎన్నికల సంఘం ఆఫీసు ముందు ధర్నా చేయడం సంచలనమైంది. ఈ నేపథ్యంలో ఈసీకి సర్‌ని పూర్తి చేయడం కత్తి మీద సాముగా మారింది.
23న బృహత్ నిరసన: ప్రకాశ్‌రాజ్
బనశంకరి: కర్ణాటకలో సర్‌కు వ్యతిరేకంగా రైతులు, దళిత సంఘాలు 23వ తేదీన బృహత్ ర్యాలీ జరపనున్నాయి. ఎన్నికల కమిషన్‌కు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ తరహాలో ప్రతి జిల్లాలో ధర్నా చేయాలని నటుడు ప్రకాష్‌రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారంనాడు ప్రజాస్వామ్య రక్షణకు జనతా ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో ధర్నాలను అణచివేయడం ఖండనీయం, ఢిల్లీని పోలీస్ నగరంగా మార్చివేశారని ఆరోపించారు.
22తో ముగుస్తున్న గడువు
27న ఓటర్ల అంతిమ జాబితా ప్రకటన
కొత్త ఓటర్ల నుంచి ఫారం–6 దరఖాస్తులు 10.07 లక్షలు అందాయి. వీరిలో ప్రవాసులవి 4,777 అదనంగా ఉన్నాయి.
ఓట్లను తొలగించాలంటూ ఫారం–7 దరఖాస్తులు 1,55,109 ఈసీకి అందాయి.
చిరునామా మార్పు ఇతర సవరణల కోసం 12.79 లక్షల దరఖాస్తులు బీఎల్‌ఓలకు వచ్చాయి.


