మైసూరు: ఆషాఢ మాసం, శుక్రవారాలు అమ్మవారి విశేష దర్శనాలు, భక్తుల రద్దీ నేపథ్యంలో మైసూరులోని చాముండిబెట్టను జిల్లా ఇన్‌చార్జి, నగరాభివృద్ధి శాఖ మంత్రి యతీంద్ర సిద్దరామయ్య బుధవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆషాఢ శుక్రవారం రోజున సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వారికి సులభంగా దర్శనం లభించేలా చేశామని, నిర్ణీత సమయంలో వీఐపీలు కూడా సామాన్య భక్తుల వరుసలోనే రావాల్సి ఉంటుందన్నారు. జిల్లాధికారి లక్ష్మీకాంతరెడ్డి, జెడ్పీ సీఈఓ యుకేష్ కుమార్, పోలీసు కమిషనర్ సీమా లాట్కర్, జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి పాల్గొన్నారు.
ఆహార పంపిణీపై నియమాలు
చాముండి బెట్టకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు వివిధ సంఘాలు, సంస్థలు, అన్నదానం, తాగునీరు వంటివాటిని పంపిణీ చేస్తుంటారు. ఇందుకు పాలికె కట్టుదిట్టమైన మార్గదర్శకాలను ప్రకటించింది. ఆహార వ్యర్థాలు, ప్లేట్లు తదితరాలను చెత్త కుండీల్లోనే వేయాలి. పరిశుభ్రతను సదరు సంస్థలే నిర్వహించాలని తెలిపింది.
భక్తులకు ఇబ్బంది రాకూడదు:
మంత్రి యతీంద్ర


