హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరులో వరుస దొంగతనాలతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. మంగళవారం రాత్రి బసవేశ్వర నగర్, విద్యానగర్‌లలో దొంగల విజృంభించారు. లెక్చరర్ సిద్దనగౌడ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోకి చొరబడి సుమారు 3 తులాల బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగిలించారు. అదే రోజు ఈశ్వర ఆలయం సమీపంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయుడు బసవనగౌడ ఇంట్లో దొంగతనం చేయడానికి విఫలయత్నం జరిగింది. కుటుంబ సభ్యులు నిద్ర మేల్కొనడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. దొంగతనాలు జరిగినప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆరోపణలు వినవస్తున్నాయి. పోలీసుల పని తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. భయపడిన నివాసితులు రాత్రివేళ తమ ఇళ్లకు తామే కాపలా కాస్తున్నారు. దొంగలను పట్టుకోవడానికి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలని, రాత్రి గస్తీని పెంచాలని ప్రజలు పోలీసులను ఒత్తిడి చేస్తున్నారు.
పలు ఇళ్లలో వరుస చోరీలు


