29 నుంచి జిల్లా ఉత్సవాలు
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో జనవరి 29 నుంచి 31 వరకూ (మూడు రోజులు) జిల్లా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లా అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఉత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దం అనంతరం జరగనున్న జిల్లా ఉత్సవాల్లో అందరు చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఇప్పటి నుంచే ముమ్మరంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం, రంగ మందిర్, మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడెదోరె రాయచూరు ఉత్సవాలకు రూ.10 కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. నాటకాలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్, బసవనగౌడ దద్దల్, వసంత్ కుమార్ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్, అదనపు జిల్లా అధికారి శివానంద, ఎస్పీ అరున్‌ంగ్సు గిరి, నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, ఈరన్న, సంతోష్ రాణి, సురేస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సమానమే
రాయచూరు రూరల్: క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్, రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ సూచించారు. ఆదివారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు ఉత్సవాలు–2026లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. శారీరక ధృఢత్వం పెంచుకోవచ్చని తెలిపారు. క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. కార్యక్రమంలో శాసన సభ్యులు హంపన గౌడ బాదర్లి, హంపయ్య నాయక్, బసవన గౌడ దద్దల్, వసంత్ కుమార్ బసన గౌడ, జిల్లా అధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్సు గిరి, నగర సభ కమిషనర్ జుబీన్ మోహ పాత్రో, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరేష్, జిల్లారోగ్య అధికారి సురేంద్ర బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి బడిగేర తదితరులు పాల్గొన్నారు.


