భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

Nov 25 2025 10:44 AM | Updated on Nov 25 2025 10:44 AM

భక్తు

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

రాయచూరు రూరల్‌: కర్ణాటక రాష్ట్రం శైవాలయాలకు, శివ భక్తులకు పుట్టినిల్లు. ఏ మారుమూల గ్రామానికెళ్లినా శివాలయాలు దర్శనమిస్తాయి. రాయచూరు నుంచి 20 కి.మీ. దూరంలోని సూగూరేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. కృష్ణా నది పక్కనే 11వ శతాబ్దంలో ఈ ఆలయం వెలసిందని శిలా శాసనాలు చెబుతున్నాయి. శివుని కొడుకుగా పిలువబడే వీరభద్రేశ్వరుడు ఇక్కడ వెలశాడు. విజయనగర సామ్రాజ్యాధిపతి ప్రౌఢ దేవరాయలు గుడి నిర్మాణం చేపట్టారు. ప్రభువు అసర వీర ప్రతాప దేవరాయలు పూర్తి చేశారు. కోల్హాపూర్‌ దేవస్థాన రాజవంశస్థుడైన బసవంతు ప్రభు కుష్టు రోగంతో బాధపడుతుండగా సూగూరేశ్వరుడు ప్రభువు కలలో కన్పించి తనను దర్శించుకుంటే వ్యాధి నయం అవుతుందని ఆజ్ఞాపించారు. రోగం నయం కావడంతో ప్రభువు గర్భగుడిని నిర్మించారు. పిల్లలు పుట్టని దంపతులు దర్శించుకుంటే సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో గట్టిగా నెలకొంది.

ప్రతి నిత్యం త్రికాల పూజలు

ఆలయం ప్రవేశ ద్వారంలో దక్షిణామూర్తిగా వెలసి శాంత మూర్తిగా దర్శనమివ్వడం భక్తులను ఆకట్టుకుంది. ధ్యాన మండపంలో విఘ్నాలు కలగకుండా విఘ్నేశ్వరాలయం ఉంది. స్వామి వారి జాతర, రథోత్సవాలు రెండు జరుగుతాయి. దక్షిణ, తూర్పు పడమరలలో వెలసిన గోపురాల్లో దేవుళ్లను ఏర్పాటు చేయడం ఆకర్షణగా మారింది. పడమర గోపురం వెలిస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసం. ఉదయం 5, మధ్యాహ్నం 11 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రత్యేక త్రికాల పూజలు చేస్తారు. ప్రతి సోమ, గురువారం బెల్లం తేరుతో ఊరేగింపు, పల్లకీ సేవలు నిర్వహిస్తారు. అభిషేకంతో పాటు మహా, కాశీ, నంద, ఆకుల, పువ్వుల, అక్షర, పల్లకీ, ఊయల పూజలు చేస్తారు. ప్రతి నిత్యం 200 మందికి ఉచిత ప్రసాదం, సోమ, గురువారం అమావాస్య రోజున 1000 మందికి అన్నదానం చేయాలని ఆలయం కమిటీ నిర్ణయించింది. పెళ్లిళ్లు చేసుకోవడానికి దాస సాహిత్య మండపం ఉంది. పేదలకు ఎలాంటి డబ్బులు లేకుండా ఉచితంగా మండపాన్ని కేటాయిస్తామని తహసీల్దార్‌ సురేష్‌ వర్మ తెలిపారు.

26న జోడు రథోత్సవాలు:

శనివారం దేవసూగూరులో సూగురేశ్వరుడి జోడు రథోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ అధికారి అసిస్టెంట్‌ కమిషనర్‌ గజానన బాళె తెలిపారు. జోడు రథోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డివిజనల్‌ కంట్రోలర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు.

శతాబ్దాల చరిత్ర గల సుందరమైన అలయం

ఐదు రాష్ట్రాల భక్తుల సమక్షంలో జోడు రథోత్సవం

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు1
1/4

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు2
2/4

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు3
3/4

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు4
4/4

భక్తుల కొంగుబంగారం సూగూరేశ్వరుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement