కొండపై చిరుత ప్రత్యక్షం
హొసపేటె: కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని బసవనదుర్గ గ్రామ శివార్లలో ఆనెగుంది సమీపంలోని కొండపై చిరుత పులి కనిపించింది. డిసెంబర్ 2, 3 తేదీల్లో అంజనాద్రిలో జరగనున్న హనుమ మాల ఉత్సవానికి సన్నాహాలు చేయడానికి నియమితులైన మున్సిపల్ ఇన్‌స్పెక్టర్ ఏ.నాగరాజ్ తన విధులను ముగించుకుని గంగావతికి తిరిగి వస్తుండగా కొండపై కనిపించిన చిరుతపులిని చూసి తన మొబైల్ ఫోన్‌లో ఆ చిత్రాన్ని బంధించాడు. కేవలం రెండు రోజుల్లో చిరుతపులి కనిపించడం మూడోసారి. ఈ విషయం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ఇటీవల చిక్కరాంపురలో చిరుత పులి కనిపించింది. కొన్ని రోజుల క్రితం సిద్దికేరిలో ఒక దూడను చంపేసిన సంగతి విదితమే.
వైభవంగా సత్యసాయి శతజయంతి
బళ్లారి అర్బన్: హొసపేటె రోడ్డులో ఈశ్వరాంబ సేవా సమితి, భక్తుల ఆధ్వర్యంలో సత్యసాయి బాబా మందిరంలో బాబా 100వ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాబా చిత్రపటానికి అభిషేకం, పూజలు నిర్వహించారు. నగర సంకీర్తన మందిరం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. బిమ్స్ ఆవరణలో రోగుల సహాయకులకు అన్నదానం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆలయంలో పూజలు, అఖండ భజనలు నిర్వహించామన్నారు. లిడ్కర్ రాష్ట్ర అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజ్ కేక్ కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఉపాధ్యక్షుడు ఈకేవీ స్వామి, సేవా సమితి కార్యదర్శి విరుపాక్షప్ప, కోశాధికారి జీవీఎస్‌ఎస్ ప్రసాద్, ప్రముఖులు మఠం గురుప్రసాద్, సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పంట నష్టపరిహారం
అందించండి
రాయచూరు రూరల్: జిల్లాలోని రైతులకు నష్టపరిహారం అందించాలని రాష్ట రైతు సంఘం అధ్యక్షుడు లక్ష్మణగౌడ సర్కార్‌ను డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. రైతులకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. వరి, పత్తి, కంది, ఇతర పంటలు ఖరీఫ్‌లో భారీ వానలకు పంటలు పూర్తిగా నష్టం సంభవించినట్లు ఆరోపించారు. ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలన్నారు. రాయచూరులో మిరప మార్కెట్‌ను ప్రారంభించాలన్నారు. మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పర్మినెంట్ చేయాలని వినతి
రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం తాలూకా సీడీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడుతూ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్రశిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
నటుడు ధర్మేంద్ర మృతికి సంతాపం
హుబ్లీ: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(90) మృతిపై జంట నగరాల్లోని వివిధ కళా, సాంస్కృతిక సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. ఆలూరు వెంకటరావ్ భవనంలో ఏర్పాటు చేసిన ధర్మేంద్రకు సంతాప కార్యక్రమంలో పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది ప్రజలను మెప్పించిన ధర్మేంద్ర హిందీ సినీ రంగానికి అందించిన సేవలు అపురూపం అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్‌తో పాటు పలువురు ప్రముఖ, సీనియర్ కళాకారులు ప్రశంసించారు.
కొండపై చిరుత ప్రత్యక్షం
కొండపై చిరుత ప్రత్యక్షం
కొండపై చిరుత ప్రత్యక్షం
కొండపై చిరుత ప్రత్యక్షం


