బెణకల్లు అడవిలో కార్చిచ్చు
హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా సరిహద్దులో ఉన్న బెణకల్లు అటవీ ప్రాంతంలో కొండలకు మొత్తం ఆకతాయిలు ఆదివారం రాత్రి నిప్పు పెట్టారు. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పూర్తిగా కాలిపోయాయి. ఈ కొండల్లో అడవి పందులు, జింకలు, కుందేళ్లు, కొండ ముచ్చులు ఎక్కువగా ఉంటాయి. కొండకు నిప్పుపెట్టడంతో అవన్నీ సజీవ దహనం అయ్యే ప్రమాదముంది. కొండ పైభాగం నుంచి మొదలైన మంటలు రాత్రి సమయానికి కొండ దిగువ ప్రాంతాలకు చేరుకున్నాయి. దీంతో రైతులు తమ పొలాలకు మంటలు వ్యాపించకుండా నానాయాతన పడుతున్నారు. అటవీ శాఖ, అగ్నిమాపక దళ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు.
అక్రమ చెక్‌పోస్టులతో
వసూళ్లపై కేసు
రాయచూరు రూరల్: జిల్లాలోని దేవదుర్గ తాలూకా తింథిణి వంతెన వద్ద అక్రమంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకొని డబ్బులు వసూలు చేసుకున్నారంటూ దేవదుర్గ ఏపీఎంసీ అధ్యక్షుడిపై కేసు నమోదైన ఘటన చోటు చేసుకుంది. చెక్ పోస్టుల వద్ద లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేశారు. ఏపీఎంసీ ఆధ్వర్యంలో అక్రమంగా చెక్‌పోస్టుల ద్వారా పన్నుల రూపంలో వసూలు చేస్తున్న నేపఽథ్యంలో ఏపీఎంసీ అధ్యక్షుడు ఆదనగౌడ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కార్యదర్శి నీలప్ప శెట్టి, ఉద్యోగులు చంద్రు, రమేష్‌లపై కేసు నమోదు చేశారు. లారీకి రూ.100 నుంచి రూ.500, రూ.1000 చొప్పున వసూలు చేశారని జాలహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
టెన్త్ ఫలితాలు మెరుగు పరచాలి
రాయచూరు రూరల్ : జిల్లాలో పదవ తరగతి పరీక్ష ఫలితాల ప్రమాణం మెరుగు పరచాలని తాలూకా విద్యా శాఖాధికారి ఈరణ్ణ కోస్గి సూచించారు. సోమవారం గిల్లేసూగూరు ప్రభుత్వ హైస్కూల్‌ను పరిశీలించి వివిధ సబ్జెక్టులపై విద్యార్థులకు విద్యా బోధన చేయాలన్నారు. పాఠ్యాంశాల ఆధారంగా ఉపాధ్యాయులు ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు ముందుండాలన్నారు. విద్యార్థులకు పరీక్ష మండలి విడుదల చేసిన ప్రశ్నపత్రికలను పరిచయం చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్ష వేళలను వివరించి పరీక్షలకు సిద్ధం చేసేందుకు సమావేశాలు నిర్వహించాలన్నారు.
కార్మిక వ్యతిరేక చట్టాలు
రద్దు చేయండి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అఖిల కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, నెలకు రూ.47 వేల వేతనాలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనాలు, కాంట్రాక్ట్ కార్మిక పద్ధతిని రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకంలో రక్షణ కల్పించాలని, రైతులకు పంట నష్టపరిహారం అందించాలన్నారు.
పాత్రికేయుల కోసం
సీఎం సంజీవిని పథకం
రాయచూరు రూరల్: రాష్ట్రంలో దినపత్రికల్లో పని చేసే విలేకరుల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి సంజీవిని పథకం అమలు చేస్తున్నట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. సోమవారం బెంగళూరులోని గాంధీభవన్‌లో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం కార్యవర్గ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ విలేకరులకు బస్‌పాస్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు, మహిళా జర్నలిస్టు నాగవేణి, రాయచూరు జిల్లాధ్యక్షుడు గురునాథ్, ప్రధాన కార్యదర్శి సిద్దయ్యస్వామి పాల్గొన్నారు.
బెణకల్లు అడవిలో కార్చిచ్చు
బెణకల్లు అడవిలో కార్చిచ్చు
బెణకల్లు అడవిలో కార్చిచ్చు
బెణకల్లు అడవిలో కార్చిచ్చు


