ఈ సర్కారు పడిపోదు
● ఫుల్లుగా లూటీ చేస్తారు:
కుమారస్వామి
కోలారు: రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం పడిపోతుందనే విశ్వాసం తనకు ఎంతమాత్రం లేదని కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి చమత్కారంగా అన్నారు. ఆదివారం కోలారు తాలూకాలోని కామదేను హళ్లి గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తాను ఎక్కడా అనలేదు. అలాంటి భ్రమలో కూడా తాను లేనన్నారు. భవిష్యత్తులో ఏమవుతుందనేది చెప్పలేము కాబట్టి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నట్లు మాత్రం చెప్పానన్నారు. కాంగ్రెస్ ఒక్కలిగ ఎమ్మెల్యేలు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసినా చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వమంటే ఏడు కోట్ల మంది ప్రజలకు బాధ్యత వహించాలన్నారు. సీఎం సిద్దరామయ్య చేసింది శూన్యమని విమర్శించారు.


