పసిబాలుడు.. రికార్డు సాధకుడు
తుమకూరు: తుమకూరు తాలూకాలోని పండితనహళ్ళి దగ్గర మందరగిరి కొండలో ఉన్న గురు మందిరం ఆలయం 450 మెట్లను సునాయాసంగా ఎక్కాడో బుడతడు. 2 సంవత్సరాల 2 నెలల బాలుడు భువన్‌రెడ్డి.. 23 నిమిషాలలో మెట్లను ఎక్కి కొండను చేరాడు. దీంతో ఇండియా బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. బాలుడు తుమకూరువాసి డి.జగదీశ్‌రెడ్డి, అనూషా దంపతుల కుమారుడు.
రూ.2.93 లక్షలు మాయం
మైసూరు: ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసిన దుండగులు రూ.2.93 లక్షల నగదును దోచేసిన ఘటన మైసూరులో జరిగింది. మైసూరు హెబ్బాళు నివాసి బాధితుడు. అతడు మొబైల్ ఫోన్‌ను చూస్తుండగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఒక మెసేజ్ వచ్చింది. అందులో డబ్బు డ్రా అయినట్లుగా ఉంది. వెంటనే బ్యాంకుకు వెళ్లి విచారించగా అతని రెండు ఖాతాల నుంచీ మొత్తం రూ.2,93,532 నగదు ఇతరుల ఖాతాకు బదిలీ అయినట్లు తేలింది. ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
బాలుడు భువన్‌రెడ్డి


