మనోవాంఛ తీరాలని డీకే సంకల్ప పూజ
సాక్షి బెంగళూరు: డీసీఎం డీకే శివకుమార్ సంకల్ప పూజ నిర్వహించారు. హాసన్ జిల్లా అరసికెరె తాలూకా యాదపురలో శ్రీ జేనుకల్ సిద్ధేశ్వర స్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తిని శుక్రవారం రాత్రి బెంగళూరులోని తన నివాసానికి తెప్పించారు. అర్చకుడు సతీశ్ నేతృత్వంలోని బృందం అడ్డపల్లకీలో ఉత్సవమూర్తిని తీసుకొని వచ్చి పూజలు చేపట్టారు. గతంలో జూలై 26న డీసీఎం జేనుకల్లు సిద్ధేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా తన ఇంటిలోనే పూజా వేడుకలను జరిపించి శనివారం ఉదయం ఉత్సవమూర్తిని తిరిగి పంపించారు.


