ముత్యాల సాగు.. లాభాలు బాగు | - | Sakshi
Sakshi News home page

ముత్యాల సాగు.. లాభాలు బాగు

Nov 21 2025 2:12 PM | Updated on Nov 21 2025 2:12 PM

ముత్య

ముత్యాల సాగు.. లాభాలు బాగు

సాక్షి,బళ్లారి: ఉన్నత చదువులు చదివి ఉపాధి అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా, సరైన ఉద్యోగ అవకాశాలు దొరకకపోవడంతో విసుగు చెందిన యువత సరికొత్త ఆలోచనలతో చేపట్టిన ముత్యాల సాగుతో అద్భుతంగా లాభాలు గడించి పలువురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా దక్షిణ భారత దేశంలో మొట్టమొదటి సారిగా ముత్యాల సాగు చేసిన ముగ్గురు యువకులు అందులో మంచి లాభాలు గడిస్తున్నారు. గదగ్‌ నగరానికి చెందిన

వీర్‌, వీరేష్‌ హిరేమట్‌్‌, కృష్ణ అనే ముగ్గురు ప్రారంభించిన ముత్యాల సాగులో మంచి లాభాలు రావడమే కాకుండా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా ముత్యాల సాగు గురించి తొలుత ఆలోచన చేసి, ఆమేరకు ఆ రంగంలో విజయం సాధిస్తున్న వీరేష్‌ అనే యువకుడు సాక్షితో మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా 2021లో అందరితో పాటు సొంత ఊరుకు చేరుకోవాల్సి వచ్చింది. గదగ్‌లో తన స్నేహితులు కృష్ణ, వీరేష్‌ అనే ఇద్దరు వ్యాపారాలు చేసి కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో అందరూ కలిసి చర్చించాం.

ఏదైనా సాధించాలనే తపనతోనే..

కృష్ణ మామకు చెందిన క్వారీలో అప్పుడప్పుడు కలిసేవారం, ఊరులోనే ఉంటూ ఏదైనా సాధించాలనే తపనతో ముందుకెళ్లాం. అప్పుడు గూగుల్‌ను పరిశీలించి ముత్యాల సాగు గురించి తెలుసుకుని ఆ సాగు పట్ల ఆసక్తిని పెంచుకున్నామన్నారు. దక్షిణ భారత దేశంలో ముత్యాల సాగు లేదు. ప్రకృతి సిద్ధమైన కారణాలతో పశ్చిమ బెంగాల్‌లో ముత్యాల సాగు జోరుగా సాగుతోందని తెలుసుకున్నాం. తమ వద్ద కూడా అనువైన స్థలం ఉండటంతో క్వారీకి ఏడాదికి రూ.లక్షకు గుత్తకు ఒప్పందం చేసుకుని సాగుకు శ్రీకారం చుట్టాం. వెంటనే పశ్చిమ బెంగాల్‌ కంపెనీని సంప్రదించాం. ఆమేరకు చర్చలు సఫలీకృతం అయ్యాయి. మీరు ముత్యాల సాగు చేయండి, వాటిని మేము కొనుగోలు చేస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చారు. వారి మాటలు నమ్మి సాగుకు ముందడుగు వేశాం. తొలిసారిగా 2021లో ఒక్కొక్కరు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి, ముత్యాల సాగుకు సంబంధించిన ముడి విత్తనాలను తెప్పించుకున్నాం. కంపెనీ ప్రతినిధులే వచ్చి సర్జరీ చేసి, వాటి నిర్వహణ విధానాలను వివరించారు. అలా ఒక ఏడాది, తర్వాత రెండేళ్ల కాలం జరిగిపోయింది.

రెండేళ్లు గడిచిన తర్వాత ఆదాయం

కొందరు తమను ఎద్దేవా చేయడంతో పాటు నవ్వుకున్నారు. పెట్టుబడిని బూడిదలో పోసిన పన్నీరు చేసుకున్నారని కొందరు తిట్టారు. అయినా తాము ఎలాంటి బాధ పడలేదన్నారు. అలా రెండేళ్లు గడిచిన తర్వాత తమకు ఆదాయం మొదలైందని, తర్వాత తమను అవమానించిన వారు ఆశ్చర్యపోయారన్నారు. రబీ సీజన్‌లో రూ.35 లక్షలు పెట్టుబడి పెడితే రూ.75 లక్షల ఆదాయం వచ్చింది. తమతో మరో 20 మంది జట్టు కట్టారు. అందరూ కలిసి వ్యాపారం చేస్తున్నారు. రూ.1.30 లక్షలతో ముడి విత్తనాలు వేయగా, రూ.కోటి వరకు ఆదాయం వచ్చింది. సర్జరీ చేశాక అవసరమైన ముత్యాలు పెరిగేలా చేయవచ్చు. సదరు ముడివిత్తనాల్లో సర్జరీ ద్వారా వచ్చిన ఆ వస్తువు, కంపెనీ కొనుగోలు చేసిన తర్వాత నేర్పరులకు, వాటిని మరింత నాజూకు పరిచి ఎక్కువ ధరకు అమ్ముతారు. అలా వీర్‌, అతని స్నేహితుల సలహా సూచనలతో ముత్యాల సాగు క్వారీ ఒక మూల నుంచి మరో మూలకు విస్తరించాం. నీటిపై ముడిచిప్పలు తేలేలా చేసేందుకు దారానికి ప్లాస్టిక్‌ బాటిల్‌ను కట్టాం. వాటి తయారీకి ఎక్కువగా వాడే డిజైనర్‌ ముత్యాలు పండిస్తారు.

వివిధ రకాల ఆకృతుల్లో పండిన ముత్యాలు

గదగ్‌ జిల్లా హాతలగేరి క్వారీలో ముత్యాల సాగు దృశ్యం

ఎకరా క్వారీలో ఉత్తమ ఖనిజాంశాల నీరు

గదగ్‌ నగర యువ రైతుల విజయ గాధ

నిత్యం టీడీఎస్‌ అమోనియం పరిశీలన తప్పనిసరి

ప్రతి రోజు ఒకసారి టీడీఎస్‌ అమోనియం పరిశీలన చేయాలన్నారు. వాటి సమతుల్యతకు ఆవు పేడ, ఆవాల పిండి, వేరుశనగ పొట్టు, పసుపు సున్నం, ఉప్పు, క్యాల్షియం తదితర ఆహారంగా అందించాలన్నారు. కొన్ని రసాయనాలను కూడా తగిన విధంగా ఓ ముడి చిప్పకు రూ.60 ఖర్చు చేయగా, పంట చేతికందిన తర్వాత తమ నుంచి దాన్ని రూ.230 ధర చొప్పున కొనుగోలు చేస్తారన్నారు. అసలుతో పాటు రెండింతలు లాభాలు వస్తాయన్నారు. యువ రైతులందరూ కలిసి పని చేయడంతో విజయం సాధించారు. వీర్‌, స్నేహితులు పేర్కొనడంతో ముత్యాల సాగు ప్రారంభించిన వేళ దక్షిణ భారతంలోనే ఇలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. ముత్యాల సాగుకు ప్రభుత్వ సాయం అవసరం, సబ్సిడీ, పంటల బీమా కల్పించాలని కోరారు. ఈ సాగుదారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లేదన్నారు. మత్స్యశాఖ అధికారులకు దీని గురించి తెలియజేస్తే ముత్యాల సాగు చేస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ముత్యాల సాగుకు నాలుగేళ్లు పూర్తయినా ఎన్నో ఆటు పోట్లు వచ్చాయన్నారు. అంతకు ముందు ఆ కంపెనీ తమ ముత్యాలను కొనుగోలు చేస్తుందో లేదోనని భయపడ్డాం అన్నారు.

ముత్యాల సాగు.. లాభాలు బాగు 1
1/2

ముత్యాల సాగు.. లాభాలు బాగు

ముత్యాల సాగు.. లాభాలు బాగు 2
2/2

ముత్యాల సాగు.. లాభాలు బాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement