
వైభవంగా మారెమ్మ దేవి జాతర
చెళ్లకెరె రూరల్: తాలూకాలోని గౌరసముద్ర గ్రామంలో వెలసిన మారెమ్మ దేవి జాతర అపార సంఖ్యలో హాజరైన భక్తుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. చెళ్లకెరె ఎమ్మెల్యే టీ.రఘుమూర్తి జాతరకు విచ్చేసి అమ్మవారికి విశేష పూజలు జరిపారు. దేవాలయం నుంచి జాతర జరిగే తిమ్మల ప్రదేశం వరకు మంగళ వాయిద్యాలు, జానపద నృత్యాలు, భజనలు చేపట్టి అమ్మవారిని ఊరేగించారు. గ్రామీణ ప్రాంత రైతులు తాము పండించిన పంటలను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తహసీల్దార్ రెహాన్ పాషా, గౌరసముద్ర జీపీ అధ్యక్షుడు ఓబన్న, తాలూకాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి జాతరలో పాల్గొన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
హాజరైన ఎమ్మెల్యే రఘుమూర్తి

వైభవంగా మారెమ్మ దేవి జాతర