
సీఎం సారథిగా గ్రేటర్ బెంగళూరు
బనశంకరి: గ్రేటర్ బెంగళూరు ప్రాధికారను ఏర్పాటైంది, ప్రాధికార అధ్యక్షునిగా సీఎం సిద్దరామయ్య, ఉపాధ్యక్షునిగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నగరాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ప్రాధికార సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శోభా కరంద్లాజే, మంత్రులు రామలింగారెడ్డి, కేజే.జార్జ్, బీఎస్.సురేశ్, దినేశ్ గుండూరావ్, కృష్ణబైరేగౌడను నియమించారు. వీరితో పాటు మంత్రి జమీర్‌అహ్మద్‌ఖాన్, ఎంపీ సీఎన్.మంజునాద్, పీసీ.మోహన్, తేజస్వి సూర్య, రాజ్యసభ సభ్యులు నారాయణ కొరగప్ప, జగ్గేశ్, జీసీ.చంద్రశేఖర్, యలహంక ఎమ్మెల్యే ఎస్‌ఆర్.విశ్వనాథ్‌తో పాటు 75 మంది నియమించారు.
కారును అడ్డగించి
రూ.15 లక్షలు దోపిడీ
శ్రీనివాసపురం: దోపిడీరులు చెలరేగిపోయారు. కారును అడ్డుకొని భారీగా నగదు దోచుకొని ఉడాయించారు. ఈఘటన శ్రీనివాసపురం సమీపంలో జరిగింది లింగరాజు అనే వ్యక్తి మండీవ్యాపారం నిర్వహిస్తున్నాడు. రైతుల నుంచి కొనుగోలు చేసిన కూరగాయలకు సంబంధించి డబ్బు చెల్లించేందుకు మంగళవారం కారులో వెళ్తుండగా పట్టణ సమీపంలో మూత్ర విసర్జనకు కారు ఆపారు. అక్కడే పొంచి ఉన్న దుండగులు లింగరాజుపై బీరు బాటిల్‌తో దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. కారులో ఉన్న రూ.15లక్షలు తీసుకొని ఉడాయించారు. బాధితుడు ఆస్పత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ నిఖిల్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.