
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం
బళ్లారి అర్బన్: జిల్లాలో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించే ఆసక్తి గల యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు వివిధ రకాల సదుపాయాలను సమకూరుస్తామని జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ(బీడీసీసీఐ) అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి అన్నారు. జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్‌లో సోమవారం బళ్లారి ఎన్‌టీసీ యశస్సు సంభ్రమ, ఎస్‌ఎంఈ బీఆర్‌ఈ రుణాల ఉత్పాదన నేర ప్రదర్శన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వాణిజ్య పన్నుల శాఖ జేడీ సోనాల్ జీ నాయక్, డిప్యూటీ కమిషనర్ ఇనాందార్ సారథ్యంలో ప్రారంభమైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల బిజినెస్ రూల్ ఇంజిన్, లోన్ ఉత్పత్తుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. దీన్ని వల్ల వర్ధమాన పారిశ్రామిక వేత్తలకు మనోబలం, ఆత్మవిశ్వాసం, సరికొత్త చైతన్యం లభిస్తుందన్నారు. తమ పరిశ్రమలను విజయవంతంగా స్థాపించి అభివృద్ధి చేసే అవకాశాలు, తీరుతెన్నుల గురించి ఆయన వివరించారు. బీడీసీసీఐ గౌరవ కార్యదర్శి కేసీ సురేష్‌బాబు, శ్రీధర్, పార్థసారథి, శివకుమార్, వెంకటేష్ కులకర్ణి, డాక్టర్ దిలీప్‌కుమార్, అవ్వార్ మంజునాథ్, సొంతా గిరిధర్, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున గౌడ, రామచంద్ర తదితరులతో పాటు వర్కింగ్ సమితి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, విశేష సమన్వయ సమితి సభ్యులు, వివిధ సంఘ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్
ఇండస్ట్రీ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి