
వర్ష బాధితులకు పరామర్శ
సాక్షి బళ్లారి: గత 15 రోజులుగా నగరంతో పాటు ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో పాటు మురికివాడల కాలనీల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీరాములు స్పందించారు. ఆయన నగరంలోని వలీసాబ్ కాంపౌండ్ పరిసరాల్లో నివాసం ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని పరామర్శించారు. వర్షాలతో కాలనీలో నీళ్లు నిలబడటంతో పాటు వీధి దీపాలు కూడా లేకుండా కటిక చీకటిలో నివాసం ఉంటుండటంతో ఆయన కాలనీని సందర్శించారు. సొంత ఖర్చుతో జేసీబీని రప్పించి నిలిచిన నీటిని తొలగింప జేశారు. రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండి సమస్యలను తొలగించేందుకు ప్రయత్నం చేశారు. వీధి దీపాలు వేయించడంతో పాటు భోజనాలను కూడా ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతోనే పని చేస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల సమస్యలు ఆలకించిన శ్రీరాములు
సొంత ఖర్చుతో జనం ఇబ్బందులకు
పరిష్కారం

వర్ష బాధితులకు పరామర్శ