
గజరాజుల తాలీముకు నాంది
మైసూరు: ప్రఖ్యాత మైసూరు దసరా వేడుకలలో పాల్గొనడానికి వచ్చిన గజరాజుల బృందం తాలీముకు శ్రీకారం చుట్టింది. శనివారం, ఆదివారం తాలీమును సాగించాయి. మైసూరు ప్యాలెస్ నుంచి బన్నిమంటపం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లకు పైగా నడుస్తూ వెళ్లి మళ్లీ తిరిగి వచ్చాయి. పాదయాత్ర సజావుగా సాగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏనుగుల మందగమనాన్ని నగరవాసులు, పర్యాటకులు ఉత్సాహంగా వీక్షించారు. తరువాత ప్యాలెస్ ఆవరణలో ఆదివారం ఉదయం గజరాజులు ఫుట్‌బాల్ ఆడుతూ సేదదీరాయి. మావటీలు, కాపలాదారులు పిల్లలతో సరదాగా ఫుట్‌బాల్ ఆడాయి.
బన్నిమంటప వరకు నడక

గజరాజుల తాలీముకు నాంది