
ఇరుకై న స్థలంలో కిక్కిరిసిన భవనాలు
శివాజీనగర: బెంగళూరులో హలసూరు ఠాణా పరిధిలోని నగర్తపేటెలో శనివారం తెల్లవారుజామున 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఐదుగురు మరణించిన దుర్ఘటనలో భవన యజమానులైన బాలకృష్ణయ్య శెట్టి, సందీప్ శెట్టి లపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు మదన్‌కుమార్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. అశాసీ్త్రయంగా భవన నిర్మాణం, భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు తెలిపారు. భవనం నేల అంతస్థులో ఉన్న ప్లాస్టిక్ మ్యాట్ గోదాములో మొదట అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు పై వరకూ విస్తరించాయి. మంటలు ఎలా పుట్టాయనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
డిప్యూటీ సీఎం పరిశీలన
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనం, ఇరుగు పొరుగున ఉండే కట్టడాలు బలహీనపడ్డాయి. వీటికి యజమానులు మరమ్మత్తులు చేయించాలి. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకొంటామన్నారు. ఆయన ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడారు. రెండు అంతస్థుల భవనం కట్టాల్సిన చోట 7– 8 అంతస్తులను నిర్మించారు. లోపలకు వెళ్లడానికి స్థలం చాలా ఇరుకుగా ఉందని చెప్పారు. ఉపాధి కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి ఐదు మంది చనిపోయారని వాపోయారు. బీబీఎంపీ కమిషనర్ మహేశ్వరరావు, నగర పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌లు ఉన్నారు.
ప్రమాద తీవ్రతకు కారణాలు
అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు అరెస్టు