
విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి
శివమొగ్గ: విహారయాత్రకు వెళ్తూ ఉండగా పికప్ వాహనం, మారుతీ ఓమ్ని కారును ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓమ్నిలోని ఒకరు మరణించగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా బలెగారు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్ పుర తాలూకాకు చెందినవారు ఓమ్ని కారులో జోగ్ జలపాతం చూడడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో పికప్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఓమ్ని కారులో ఉన్న శేఖర్ అనే చనిపోగా, మరో 8 మందికి గాయాలతో ఆర్తనాదాలు చేశారు. ఓమ్ని మొత్తం నుజ్జయింది. స్థానికులు, పోలీసులు కలిసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ పరిశీలించారు. సాగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.